వీధి కుక్కల దాడిలో ఆవు దూడలు మృతి..

వీధి కుక్కల దాడిలో ఆవు దూడలు మృతి..

వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో శనివారం రాత్రి వీధి కుక్కల దాడిలో రెండు ఆవు దూడలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. రాచూర్ గ్రామానికి చెందిన కొంగళ్ళ అల్లాజి శనివారం సాయంత్రం పాలు పితుకొని ఇంటికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం అల్లాజి పాల కొరకై ఆవుల వద్దకు చేరుకొనగా రెండు ఆవు దూడలు మృతి చెంది ఉండడాన్ని గమనించి కన్నీరుమున్నీరు అయ్యాడు. పాల వ్యాపారం చేస్తూ జీవనం సాధించేవారు.

నేడు రెండు ఆవు దూడలు మృతి చెందడం వలన నష్టపోవడమే కాక ఉపాధిని కోల్పోయినట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి రైతుని ఆదుకోవాలని వేడుకున్నారు. అనంతరం వీధి కుక్కల పై అధికారులు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ విషయం పై గ్రామ సర్పంచ్ ని ఫోన్లో సంప్రదించగా త్వరలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకునే విధంగా చూస్తామని తెలిపారు.

Leave a Reply