లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ…

లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ…

విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ప్రాంగణంలో ఈ రోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల సమక్షంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ చెక్కులను కార్పోరేషన్ అదనపు కమిషనర్ (జనరల్) జి. రవీంద్ర రావు, అకౌంట్స్ ఆఫీసర్ బి.ఎస్.ఎన్. మూర్తి లబ్ధిదారులకు అంద జేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ అధికారులు ఎన్. శ్రీనివాసరావు ప్రాంతీయ మేనేజర్, విజయవాడ వెస్ట్, ఎం. భాస్కర్ రావు చీఫ్ మేనేజర్ (డిపాజిట్స్.. వీఏఎస్) ఎస్. శివరాం, బ్రాంచ్ మేనేజర్, కార్పొరేషన్ బ్రాంచ్ ఎస్‌బీఐ ఎస్‌జీఎస్‌పి గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయబడినవి.

ఈ లబ్ధిదారులు పబ్లిక్ హెల్త్ వర్కర్స్ 5, సానిటరీ ఇన్‌స్పెక్టర్ 1, సానిటరీ మైస్త్రీ 1, ఆయా కుటుంబ సభ్యులు గుండెపోటు, దీర్ఘకాలిక అనారోగ్యం, ఇతర వైద్య కారణాల వల్ల మరణించినవారు. ఈ సందర్భంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు అధికారులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఇటువంటి క్లిష్ట సమయం లో ఆర్థిక సహాయం ఎంత ముఖ్యమో వివరించారు. బ్యాంకు వారు బీమా క్లెయిమ్‌లను సమయానికి పరిష్కరించి, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించారు.

ఈ పథకం ప్రయోజనాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జీత ఖాతాలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు అందుబాటు లో ఉంటాయని తెలియజేశారు. ఈ పథకం కింద 62 సంవత్సరాల వయస్సు వరకు (రిటైర్మెంట్ వరకు) బీమా రక్షణ కల్పించబడుతుంది. ముఖ్యంగా, ఈ బీమా కవరేజ్ పూర్తిగా ఉచితంగా, ఎటువంటి ప్రీమియం లేకుండా అందించబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సంక్షేమం, సామాజిక బాధ్యత పట్ల తన కట్టుబాటును మరోసారి వెల్లడించింది.ఈ ఆర్థిక సహాయం లబ్ధిదారుల కుటుంబాలకు ఈ క్లిష్ట సమయంలో ఈ పథకం తోడ్పడుఅందిస్తుందని వారు తెలిపారు.

Leave a Reply