వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి రథసారతులు

జుక్కల్(కామారెడ్డి), ఆంధ్రప్రభ : వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి రథసారతులని కామారెడ్డి జిల్లా జడ్పి సీఈఓ చందర్ నాయక్ అన్నారు.నూతనంగా ఎన్నికైన జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు జుక్కల్ లో వీడుతల వారీగా శిక్షణ కార్యక్రమం కొనసాగింది.శనివారం నాడు శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ సీఈఓ చందర్ నాయక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి వార్డు సభ్యులు కీలకపాత్ర వహించాలని,ఈ శిక్షణ కార్యక్రమంలో వార్డు సభ్యులకు ఏంతో దోహదపడుతుందన్నారు.
గ్రామంలో మంచి నీటిసరఫరా,పచ్చదనం పరిశుభ్రత,వీధిదీపాల ఏర్పాటుతో పాటు ప్రభుత్వం ద్వారా అందించే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా వార్డు సభ్యులు తమ వంతు కృషి చేయాలన్నారు దీంతోపాటు గ్రామ సభల విజయవంతం కోసం కూడా వార్డు సభ్యులు తమవంతు సహకారం అందించారన్నారు. జెడ్పి సిఈఓ చందర్ నాయక్ ఎంపీడీఓ బి.శ్రీనివాస్, ఎంపిఓ రాముతో కలసి వార్డ్ సభ్యులు గ్రూప్ ఫోటో దిగారు.
