తిమ్మంపేట పాఠశాలలో మార్కెట్ డే..

తిమ్మంపేట పాఠశాలలో మార్కెట్ డే..
- ముఖ్య అతిథిగా సర్పంచ్ తుర్రం శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ సాయిబాబు
- మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ తాండ్ర ప్రభాకర్ రావు
- గ్రామ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్
- డాక్టర్ వెంకటేశ్వరరావు
ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండలంలోని తిమ్మంపేట ప్రాథమికొన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి, ప్రాయోగిక అభ్యాసానికి ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రత్యేక కార్యక్రమమైన “మార్కెట్ డే” నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
కార్యక్రమ లక్ష్యాలు..
మార్కెట్ డే ద్వారా విద్యార్థుల్లో ప్రాథమిక గణిత నైపుణ్యాలు, ఆర్థిక అవగాహన, సంభాషణ నైపుణ్యాలు, జట్టు భావం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం ప్రధాన ఉద్దేశ్యం.
ఏర్పాటు చేయబడిన స్టాళ్లు..
మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పువ్వులు తినుబండారాలు ఏర్పాటు చేశారు. డాక్టర్ వెంకటేశ్వరరావు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ, మన నిజ జీవితంలో డ్రగ్స్ దూరంగా ఉండాలని, డ్రగ్స్ వలన జరిగే నష్టాలను విద్యార్థులకు తెలియజేశారు.
అనంతరం ప్రధానోపాధ్యాయులు బి శంకర్ మాట్లాడుతూ.. ఈ మార్కెట్ డే కార్యక్రమం మా విద్యార్థులకు ఒక అర్థవంతమైన, ఆనందభరితమైన జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివో విజయ, గోపి, గుడ్ సేఫర్డ్ సంస్థ సభ్యులు ఉదయ, విద్యాసాగర్ , ఉపాధ్యాయులు నిర్మల, సురేష్, ప్రశాంత్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

