Warns | వచ్చేే ఏడాది మార్చి నాటికి నక్సలిజం కనుమరుగు – అమిత్ షా

న్యూ ఢిల్లీ ‍ ‍- వచ్చే మార్చి 31 వరకు నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మన సైనికులు ‘నక్సల్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్’ దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్‌లలో మన భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 30 మంది నక్సలైట్లు చనిపోయారని తెలిపారు. మోడీ ప్రభుత్వం నక్సలైట్లపై కఠినమైన వైఖరితో ముందుకు సాగుతోందని.. లొంగిపోవడం కోసం అవకాశం కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోలేని మావోయస్టులు పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారబోతోందని స్పష్టం చేశారు.

Leave a Reply