మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డిఎంహెచ్ఓ.. కార్పొరేటర్
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు హన్మకొండ జిల్లా వైద్య అధికారి ( డీఎంహెచ్ఓ) అప్పయ్య అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక.. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి రామ్ భార్గవ్ నేతృత్వంలో సిబ్బంది నిర్వహించినఉచిత వైద్య శిబిరాన్ని డిఎంహెచ్ఓ తో పాటు స్థానిక 66 డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ లు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరానికి గ్రామీణ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో.. మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు.
ఎల్లప్పుడూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించిన అనంతరం మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య శిబిరంలో 62మందికి కంటి, 32 మందికి దంత, 115 మందికి ఆర్థోపెడిక్. 116 మందికి జనరల్ మెడిసిన్ తో పాటు 65 మంది మహిళలకు,18 మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి వైద్యులు కృత్తికా రెడ్డి,ప్రహసిత్ సురేష్,మల్లేష్, క్రాంతి,మానస, విజయ,సాయిశ్రీ హసన్ పర్తి ఎంపీడీవో సుమనవాణి నర్సింగ్ అధికారులు విజయలక్ష్మి,జనార్దన్ సూపర్ వేజర్ లు లచ్చులు,రూతమ్మ,హెల్త్ అసిస్టెంట్ సంతోష్, నాగయ్య, ఇంద్రారెడ్డి, మోసిన్ తోపాటు ఆశా వర్కర్ లు పాల్గొన్నారు
