ప్రమాదాలకు కారణం అదే..

ప్రమాదాలకు కారణం అదే..

చిలుపూర్, ఆంధ్రప్రభ : వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణించడం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు జనగామ జిల్లా పోలీస్ అధికారి రాజమహేంద్ర నాయక్ తెలిపారు. చిలుపూర్ మండలం పరిధిలోని చిన్న పెండ్యాల జాతీయ రహదారి పై పెట్రోకార్ పోలీసు వాహనంతో పాటు కానిస్టేబుల్ తో కూడిన కార్డు బోర్డుతో తయారు చేసిన చిత్ర పటాన్ని చిల్పూర్ ఎస్సై సిరిపురం నవీన్ కుమార్ ఏర్పాటు చేయగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వాహనదారులను ఉద్దేశించి డీసీపీ మాట్లాడుతూ.. రాంగ్ రూట్లో వాహనదారులు రావడం వల్ల ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నట్లు తెలిపారు. అదే విధంగా యూటర్న్ చేసే క్రమంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నట్లు వెల్లడించారు. సర్వీస్ రోడ్డులో వెళ్లే ప్రయాణికులు రాంగ్ రూట్లో వెళ్తున్నారని వారిని చైతన్యపరిచేందుకు మెట్రో కార్ తో పాటు పోలీస్ కానిస్టేబుల్ చిత్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ పోలీసులు ఉన్నారనే భావన కలిగి సక్రమమైన మార్గంలో వెళ్లాలని ఆలోచన కలుగుతుందని ఆయన తెలిపారు.

వాహనదారులు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని ఆయన కోరారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ సిరిపురం నవీన్ కుమార్, చిన్న పెండ్యాల మాజీ సర్పంచ్ తాళ్లపల్లి సమ్మయ్యతో పాటు గ్రామస్తులు, వాహనదారులు పాల్గొన్నారు.

Leave a Reply