Telangana | భార్య పరిస్థితి విషమం…

Telangana | భార్య పరిస్థితి విషమం…

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భార్యపై అనుమానంతో భర్త పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటుచేసుకుంది.

అనుమానంతో భార్య రమ్యపై భర్త నవీన్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డువచ్చిన అత్తమామలపై దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన రమ్యను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవీన్, మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం రమ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply