ఉగాది తేదీపై స్పష్టత..

ఉగాది తేదీపై స్పష్టత..
నార్సింగి, ఆంధ్రప్రభ : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను మార్చి 19, గురువారం నాడే జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమాఖ్య విద్వత్ సభ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని మెదక్ జిల్లా నార్సింగి మండల సంఘ సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుల్యాకుల శ్రీనివాస్ శర్మ వెల్లడిస్తూ, వేద పండితుల నిర్ణయం మేరకు అదే రోజు ఉగాది నిర్వహించుకోవాలని తెలిపారు. ఉగాది తేదీపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని భక్తులను కోరుతూ, ఎటువంటి సందేహాలు లేకుండా శాస్త్రోక్తంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.
