International | ఘ‌నంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

International | ఘ‌నంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

International | అల్వాల్, ఆంధ్ర‌ప్ర‌భ : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అల్వాల్ మండల కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సోమవారం అల్వాల్‌లోని హెచ్ఎంటీ బతుకమ్మ పార్క్ (హై టెన్షన్ రోడ్) లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాజీ కార్పొరేటర్ శాఖ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అలాగే ఐవీఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, ప్రత్యేక అతిథిగా తుర్కపల్లి కిరణ్మయి, ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ చైర్మన్, యూట్యూబ్ సెలబ్రిటీస్ శ్రీకాంత్, సంధ్య కపుల్స్, స్మైలీ ఈవెంట్ యాంకర్ లు హాజరయ్యారు. అనంతరం భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా క్లాసికల్ డాన్స్, తాంబోలా గేమ్, ఆట పాటలతో, జోకులతో మహిళలను ఆలరించారు.

ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ అల్వాల్ మండల అధ్యక్షుడు బచ్చు చంద్రశేఖర్, రమాదేవి, ప్రధాన కార్యదర్శి పాలకుర్తి నరేష్ రజిని, వైస్ ప్రెసిడెంట్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ శ్రీదేవి, రత్న సత్యనారాయణ, శ్రీనివాస్ రాధా, బిక్కినెళ్లి నర్సింలు, కార్యవర్గ సభ్యులు, స్థానిక మహిళలు, కుటుంబ సభ్యులు, వైశ్య సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

International |

CLICK HERE TO READ MORE : Farmer Hopes evaporate : కంపెనీల కిరికిరి Andhra Prabha SPL Story

CLICK HERE TO READ MORE :

Leave a Reply