స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి..

ఆలేరు, ఆంధ్రప్రభ : స్వయం ఉపాధి మార్గాల ద్వారా ఆర్థికంగా ఉన్నతంగా యువత ఎదగాలని కాంగ్రెస్ నాయకులు బీజని భాస్కర్ అన్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో నేతలు ముదిగొండ శ్రీకాంత్, పోరల్ల సతీష్, దూడల రాజశేఖర్ గౌడ్, ఎలక్ట్రికల్ షాప్ యజమాని సతీష్ తదితరులు పాల్గొన్నారు.
