treatment | కొనసాగుతున్న చికిత్స

treatment | కొనసాగుతున్న చికిత్స
హైదరాబాద్‌కు బొత్స సత్యనారాయణ తరలింపు
సిటీ న్యూరో సెంటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న చికిత్స
నిన్న రాత్రి సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరిన బొత్స సత్యనారాయణ
ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరికొన్ని గంటల్లో ఆయన ఆరోగ్యంపై వైద్యులు పూర్తిగా క్లారిటీ ఇవ్వనున్నారు. బొత్స సత్యనారాయణ అనారోగ్య వార్త తెలియగానే వైసీపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. కాగా బొత్స ప్రస్తుతం వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు.
