పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ..

పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో వేకువజామున పారిశుద్ధ్య కార్మికులు మోత్కూర్ -నార్కెట్ పల్లి మెయిన్ రోడ్డులో చేస్తున్న చెత్త సేకరణ పనులను మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రజలు, వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా కార్మికులు రోడ్ల పై ఉన్న చెత్త ను విధిగా వాహనాల్లో తరలించాలన్నారు.

ఏమైనా సమస్యలు ఉంటే కార్మికులు తమ దృష్టికి తీసుకువస్తే తాము పరిష్కరిస్తామని సూచించారు. మున్సిపాలిటీలో చెత్త సేకరణతో పాటు నిత్యం కార్మికులు డ్రైనేజీలు శుభ్రపరచడం జరుగుతుందని, ఇబ్బందులు ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని చైర్మన్ స్వప్న కోరారు.

Leave a Reply