మాజీ ఎంపీని కలసిన బీజేపీ నేతలు

మాజీ ఎంపీని కలసిన బీజేపీ నేతలు

చల్లపల్లి – ఆంధ్రప్రభ : అరకు మాజీ పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీతను బీజేపీ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. చల్లపల్లి మండలంలోని చిట్టూర్పు గ్రామానికి చెందిన పరుచూరి పిచ్చేశ్వరరావు సతీమణి కోటేశ్వరమ్మ ఇటీవల మరణించారు. తన అత్త కోటేశ్వరమ్మ మరణించడంతో చిట్టూర్పు గ్రామంలో గురువారం జరుగుతున్న పెద్దకర్మ కార్యక్రమానికి కొత్తపల్లి గీత వచ్చారు.

ఈ సందర్భంగా కోటేశ్వరమ్మ చిత్రపటానికి తన భర్త రాంబాబుతో కలిసి గీత పూలమాలలతో నివాళులు అర్పించారు. కొత్తపల్లి గీతాను పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ జిల్లా కార్యదర్శి వేములపల్లి శ్రీహరి, గ్రామ ప్రముఖులు మల్లంపాటి లీలా కుమార్, బిజెపి ఘంటసాల మండల అధ్యక్షులు తాళ్లూరి హరిప్రసాద్, మేక శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply