Venky | అసలు ప్లాన్ మారిందా..?

Venky | అసలు ప్లాన్ మారిందా..?

Venky | దసరాకి ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ ప్లాన్
మలయాళంలో దృశ్యం 3కి ముగింపు
హిందీలో వేరే కథతో అజయ్ దేవగన్
వెంకీ డేట్స్ సమస్యే కారణమా?
దృశ్యం 3 తెలుగు వెర్షన్‌పై సందిగ్ధత
వెంకటేష్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : విక్టరీ వెంకటేష్‌.. దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మలయాళంలో దృశ్యం 3 రెడీ అవుతుంది. త్వరలో రిలీజ్ కానుంది. అయితే.. వెంకీ కూడా తెలుగులో దృశ్యం 3 చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. వెంకీ ఆదర్శ కుటుంబం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీంతో వెంకీ దృశ్యం 3 ఉండదు.. ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టే అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అసలు ఏం జరిగింది..? నిజంగానే వెంకీ ప్లాన్ మారిందా..?

Venky | దసరాకి ఆదర్శ కుటుంబం..

Venky

వెంకటేష్.. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో.. ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తన రూటు మార్చి మరీ.. సరికొత్త కథతో సినిమా చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దుబాయ్ లో కూడా ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్కడ వెంకీ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే.. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అనుకున్న ప్రకారం షూటింగ్ జరగపోవడం వలన పోస్ట్ పోన్ అయ్యింది. దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనేది లేటెస్ట్ న్యూస్.

Venky | ఆ కథకు ముగింపు దృశ్యం 3..

Venky

ఇదిలా ఉంటే.. ఆదర్శ కుటుంబం సమ్మర్ లో రిలీజ్ అయితే.. దృశ్యం 3 వెంటనే పట్టాలెక్కించాలి అనుకున్నారు కానీ.. దసరాకి పోస్ట్ పోన్ అవ్వడంతో వెంకీ ప్లాన్ మొత్తం మారిందని టాక్. మేటర్ ఏంటంటే.. మలయాళంలో దృశ్యం 3 ఏప్రిల్ 2న రిలీజ్ కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వనున్నారు. కొడుకు శవం కోసం అల్లాడిపోతున్న పోలీస్ ఆఫీసర్ కుటుంబానికి హీరో ఎలాంటి పరిష్కారం చూపించాడనేది ఎమోషనల్ టచ్ తో చూపిస్తారట దర్శకుడు జీతూ జోసెఫ్. మరో వైపు దీనితో సంబంధం లేకుండా హిందీ దృశ్యం 3 వేరే కథతో అజయ్ దేవగన్ పరుగులు పెట్టిస్తున్నాడని బాలీవుడ్ రిపోర్ట్. ఇది అక్టోబర్ లో వచ్చేస్తుంది.

Venky | అందుకే.. వెంకీ చేయడం లేదా..?

Venky

అయితే.. తెలుగులో దృశ్యం 3 ఇప్పట్లో మొదలయ్యే సూచనలు లేవు. ఆదర్శ కుటుంబం తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి వెంకీ ఓకే చెప్పారు. వెంకీ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో దృశ్యం 3 తెలుగు వర్షన్ దాదాపు క్యాన్సిల్ అయినట్టేనని టాక్ వినిపిస్తోంది. మలయాళంలో దృశ్యం 3 రిలీజైన 50 రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుంది. మెయిన్ ట్విస్టులు అన్నీ తెలిసిపోతాయి. పైగా సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకీ క్రేజ్ వేరే లెవల్లో ఉంది. ఇప్పుడు ఈ సినిమా చేస్తే ఎంత వరకు ఆదరిస్తారనేది డౌటే. అందుకనే.. ఈ మూవీని వెంకీ క్యాన్సిల్ చేసినట్టు తెలిసింది. ఇది వెంకీ తీసుకున్న మంచి నిర్ణయమే అంటున్నారు సినీ జనాలు. మరి.. వెంకీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Leave a Reply