నంద్యాల బ్యూరో, మార్చి 15, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మహానంది మండలం గోపవరం గ్రామంలోని ఓ రైతు బొప్పాయి పంటను శనివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. గ్రామంలోని రైతు ప్రసాద్ బొప్పాయి తోటను సాగుచేయగా, కొందరు వ్యక్తులు నరికివేశారు.
చర్చిలో జరుగుతున్న ఆదిపత్య పోరే అందుకు కారణమని బాధితుని బంధువులు వాపోతున్నారు. రైతు ప్రసాద్ బొప్పాయి పంట చేతికి వచ్చే టైంలో చెట్లను నరికివేయడంతో లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై బాధితుడు మహానంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.