26 Feb2026 | తిరుమల సమాచారం..

26 Feb2026 | తిరుమల సమాచారం..
26 Feb2026 | తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం
శ్రీవారి సర్వదర్శనానికి 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,035 మంది భక్తులు
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.48 కోట్ల రూపాయలు
నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 27,090 మంది భక్తులు
ఓం నమో వేంకటేశాయ
26 Feb2026 | వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు..
నేటి నుంచి మార్చి నెల 2వ తేదీన వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి పుష్కరిణిలో ఐదు రోజుల పాటు వైభవంగా తెప్పోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అదనపు ఈవో వెంకయ్య చౌదరి పర్యవేక్షణలో తెప్పల ట్రయల్ రన్ కూడా జరిగింది. ఇవాళ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో తెప్ప పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రేపు రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్ప పై విహారం.. మిగతా మూడు రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. తెప్పోత్సవం కారణంగా పలు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.


