శాస్త్రీయ పద్ధతిలో రైతులు వ్యవసాయాన్ని చేయాలి

శాస్త్రీయ పద్ధతిలో రైతులు వ్యవసాయాన్ని చేయాలి
జగదేవపూర్, ఆంధ్రప్రభ: జగదేవపూర్ మండల పరిధిలో వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రీయ పద్ధతిలో రైతులు వ్యవసాయ నిర్వహించాలని శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ ఆత్మ ములుగు Division ఆత్మ సౌజన్యంతో ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్(BTM) దిలీప్ కుమార్ మాట్లాడుతూ రైతులకు నేల ఆరోగ్య నిర్వహణ నేల పరీక్షలపై శిక్షణ కార్యక్రమం రైతులలో శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంపొందించేందుకు పంట ఉత్పాదకతను మెరుగుపరచేందుకు “నేల ఆరోగ్య నిర్వహణ నేల పరీక్షలు” అనే అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం తీగుల్ క్లస్టర్ అలిరాజ్పేట్ గ్రామం లో జగదేవపూర్ మండలం లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నేల ఆరోగ్యం వ్యవసాయానికి పునాది అనే విషయాన్ని నిపుణులు ఆత్మ అధికారి దిలీప్ కుమార్ వివరించారు. నేల సారాన్ని కాపాడుకోవడం ద్వారా అధిక దిగుబడులు, మెరుగైన పంట నాణ్యత, తక్కువ ఖర్చులు దీర్ఘకాలిక స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుందని తెలియజేశారు. శిక్షణలో భాగంగా రైతులకు సరైన విధంగా నేల నమూనాలు సేకరించడం, నేల పరీక్షా నివేదికలను అర్థం చేసుకోవడం, పోషక నిర్వహణ ప్రణాళిక తయారు చేయడం, సమతుల్య ఎరువుల వినియోగం వంటి అంశాలపై ప్రాయోగిక శిక్షణ అందించారు.
నేలలో సేంద్రియ పదార్థాల పెంపు, పిహెచ్ స్థాయి నియంత్రణ, పంటల మార్పిడి, కంపోస్టింగ్ మరియు సమగ్ర పోషక నిర్వహణ వంటి పద్ధతుల ప్రాముఖ్యతను వివరించారు.ప్రభుత్వం అందిస్తున్న నేల ఆరోగ్య పథకాలు మరియు వ్యవసాయ విస్తరణ సేవల గురించి కూడా రైతులకు సమాచారం అందించారు. కచ్చితమైన ఎరువుల వినియోగానికి మరియు ఖర్చు తగ్గింపుకు రైతులు క్రమం తప్పకుండా నేల పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శరణ్య (ATM) క్రాంతి, FPO ఛైర్మన్ S. బాపు రెడ్డి రైతులు పాల్గొన్నారు
