విద్యార్థుల కోసం వినూత్నకార్యక్రమం…

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని జెడ్ పీఎస్ ఎస్ లింగాపూర్ టీచర్లు స్థానిక పాఠశాల హెచ్ఎం వెంకట రమణ ఆదేశాల మేరకు ఈ నెల 24న మంగళవారం మండలంలోని పెత్తర్పు, గోండు గూడ నర్సాపూర్ కాలనీల నుంచి బడికి సరిగా రాని విద్యార్థుల ఇండ్లకు వెళ్లి “ప్రతి రోజు బడికి రండి…..బాగా చదువుకొండి “ అనే వినూత్న కార్యక్రమంను ప్రారంభించారు. జెడ్ పి ఎస్ ఎస్ లింగాపూర్ కు చెందిన టీచర్లు కాలేరి భూమేశ్వర్, వాల్గోట్ కిషన్ లు గొండుగూడకి చెందిన ఆత్రం దేవి, నర్సాపూర్ కి చెందిన గంగా ప్రసాద్, బాను ప్రసాద్, పద్మ, నర్సాపూర్ కి చెందిన నిహారిక, రాంచరణ్, పెత్తర్పుకి చెందిన రాంచరణ్, రంజిత్ మొదలగు విద్యార్థులకు ఇంటికి వెళ్లి విద్యార్థుల తల్లితండ్రులు, విద్యార్థులకు చదువు ఆవశ్యకత గురించి కౌన్సిలింగ్ నిర్వహించగా రేపటి నుండి ప్రతి రోజు పాఠశాలకు పంపిస్తామని విద్యార్ధుల తల్లితండ్రులు తెలిపారు.
