TG Assembly | కీలక బిల్లులను నేడు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం

హైదరాబాద్ : గవర్నర్ ప్ర సంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై శ నివారం ఉదయం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం సభలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అలాగే సభలో పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ సవరణ బిల్లు 2025ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించనున్నట్లు శాసనసభ కార్యాలయం విడుదల చేసిన బులిటన్ లో పేర్కొంది.

ఆదివారం శాసనసభకు సెలవు. 17, 18 తే దీల్లో రెండు రోజుల పాటు బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చిస్తారు. అనంత రం వీటి అమలుకు కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నది. ఆతర్వాత ఈ ఆర్థ్ధిక సంవత్సరం 2025 -26 వార్షిక బడ్జెట్‌ను 19వ తేదీన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెడతారు. దీ నిని శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బా బు ప్రవేశపెడతారు.

ఆతర్వాత ఉభయ సభలు ఆరోజు వాయిదా పడతాయి. దీనిపై సభ్యుల అధ్యయనం కోసం 20 వ తేదీన సభకు సెలవు ప్రకటించి తిరిగి 21, 22 తేదీల్లో రాష్ట్ర బడ్జెట్ పద్దులపై చర్చ జరుగనున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *