Collector | లూజ్ పాలు విక్రయాలపై దాడులు

Collector | లూజ్ పాలు విక్రయాలపై దాడులు

విజయవాడలో విస్తృత తనిఖీలు
7 శాంపిల్స్ సేకరణ
కల్తీపై అప్రమత్తం కావాలి..
వినియోగదారులకు అధికారుల సూచనలు

Collector | విజయవాడ, ఆంధ్రప్రభ : ఇటీవల రాజమండ్రిలో చోటుచేసుకున్న దుర్ఘటన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో లూజ్ పాలు విక్రయించే అవుట్‌లెట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలు నగరంలోని కృష్ణలంక, పంటకాలువ రోడ్డు, కరెన్సీ నగర్, ప్రసాదంపాడు, గురునానక్ కాలనీ తదితర ప్రాంతాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ అవుట్‌లెట్ల నుండి మొత్తం 7 పాల నమూనాలను సేకరించారు.

వాటిని నాణ్యత పరీక్షల కోసం విమ్టా ల్యాబ్స్కు పంపించారు. జిల్లాలో ఇటువంటి తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. కల్తీ పాలను గుర్తించే చిట్కాలను అధికారులు మాట్లాడుతూ పాలు ఎక్కువగా చిక్కగా ఉంటే పిండిపదార్థాలు కలిపిన అనుమానం ఉంటుంది. పరీక్ష కోసం పాలలో అయోడిన్ చుక్కలు వేస్తే నీలి రంగులోకి మారితే కల్తీగా భావించాలన్నారు.

Collector |

వెన్న శాతం పెంచేందుకు వెజిటబుల్ ఆయిల్ కలపడం జరుగుతుందని, పాలు అసాధారణంగా జిడ్డుగా ఉంటే అప్రమత్తం కావాలని, చేదు రుచి, దుర్గంధం ఉన్న పాలను వినియోగించరాదని, సహజ పాలు త్వరగా చెడిపోతాయి. ఎక్కువసేపు నిల్వ ఉంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాల వినియోగం అనుమానించాలని చెప్పాలి.

Collector |

ప్రజలకు సూచనలలో పాల కల్తీపై అనుమానం ఉన్నప్పుడు వెంటనే ఫుడ్ సేఫ్టీ లేదా పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని, పరీక్షల్లో కల్తీ నిర్ధారణైతే బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని, పాలను ప్లాస్టిక్ లేదా అల్యూమినియం క్యాన్లలో రవాణా చేయకుండా, కేవలం స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్లలోనే రవాణా చేయాలని, లూజ్ పాలు విక్రేతలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు.

Leave a Reply