ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ జన్మదిన వేడుకలను జుక్కల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరేగింపుగా వెళ్లి అంబేడ్కర్ చౌరస్తా వద్ద టపాకాయలు కాలుస్తూ సంబరాలు నిర్వహించడమే కాకుండా,కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించడమే కాకుండా స్వీట్లలను, పండ్లను పంపిణీ చేశారు.తెలంగాణ స్వారాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు.. ఆయువుఆరోగ్యంగా,నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని బిఆర్ఎస్ శ్రేణులు ఆకాంక్షించారు.

Leave a Reply