బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ..

బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ..
- రాగంశెట్టి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం..
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా 17వ వార్డు కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణ సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు . స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ఆయనతో వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్‌పర్సన్‌గా దావ స్వాతితో పాటు వైస్ చైర్మన్‌గా సత్యనారాయణ బాధ్యతలు చేపట్టడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది.
అనంతరం వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా అవకాశం కల్పించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వినోద్ దిశానిర్దేశంలో, చైర్‌పర్సన్ దావ స్వాతితో కలిసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. 17వ వార్డుతో పాటు బెల్లంపల్లి పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరినీ కలుపుకుంటూ, పట్టణంలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గంశెట్టి సత్యనారాయణ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఫోటో రైటప్: వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న రాగంశెట్టి సత్యనారాయణ
