చైర్ పర్సన్ ఎన్నిక కోసం సర్వం సిద్ధం

చైర్ పర్సన్ ఎన్నిక కోసం సర్వం సిద్ధం
వికారాబాద్, ఫిబ్రవరి 16 ( ఆంధ్రప్రభ): వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక కోసం సర్వం సిద్ధమైంది. అందుకు తగ్గ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి నేతృతంలో పూర్తి చేశారు. మున్సిపల్ కాలంలో కౌన్సిల్ ఛాంబర్ నందు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె అనన్య చైర్ పర్సన్ గా ఇప్పటికే ఎంపిక చేయగా, వైస్ చైర్మన్ గా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఎన్నిక కానునట్టు సమాచారం. మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఎన్నిక లాంఛనంగా మారింది.
