TG | సమయం వచ్చినపుడు తగిన శాస్తి జరుగుతుంది : కవిత

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేర‌కు ట్విట్ట‌ర్ (ఎక్స్) వేదిక‌గా స్పందిస్తూ… ఉద్యమ నేత, ప్రజా నాయకుడు కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆక్షేపణీయం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు కవిత తెలిపారు.

మానవత్వం లేని ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకోవాలని కవిత సూచించారు. తెలంగాణ సమాజం ఇలాంటి దుశ్చర్యలను గమనిస్తోందని, సమయం వచ్చినపుడు ఇంతకింత తగిన శాస్తి జరుగుతుందని ఆమె అన్నారు.

Leave a Reply