14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కర్రెం వాకిటి మానస హన్మంతు గెలుపు

మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 14వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన వాకిటి మానస హన్మంతు విజయం సాధించారు. కాంగ్రెస్ బిజెపి అభ్యర్థి మధ్య పోరావోరుగా సాగిన పోరులో కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి మానస హన్మంతు కి 562 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి కావలి రాధ వెంకటేష్ కు 449 ఓట్లు లభించాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి మానస హన్మంతు 113 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
