Citu | సిఐటియు సమ్మె జయప్రదం చేయండి …

Citu | సిఐటియు సమ్మె జయప్రదం చేయండి …
Citu | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ: నేడు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు జనగామ జిల్లాలోని, సంఘటిత అసంఘటిత కార్మికులందరికీ, ప్రభుత్వవేతర,ప్రైవేటు సంస్థలలో పని చేస్తున్నటువంటి స్కీం వర్కర్లకు నేడు చేపట్టిన సమ్మె ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బైరగోని అంజుమ్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను రద్దు పరుస్తూ నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చింది. రానున్న రోజులలో యూనియన్లను లేకుండా చేస్తుంది కానీ నేడు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలుతో కార్పొరేట్ సంస్థల సులభతర వ్యాపారానికి ద్వారాలు తెరిచింది. కార్పొరేట్ల ప్రయోజనాలు వారి లాభాలు పెంచేందుకు 2025 నవంబర్ 21న లేబర్ కోడ్స్ అమలుకు కు నోటిఫికేషన్ జారీ చేసింది.
మోడీ ప్రభుత్వం జారీ చేసిన నాలుగు లేబర్ కోడ్ ల వలన 40 కోట్ల సంఘటిత అసంఘటిత కార్మికులు వారి కుటుంబాలు చితికి పోయేలా కార్పొరేట్ ల లాభాలు పోగేసుకోవడానికి మార్గాన్ని సులభం చేసింది.ఇంతకుముందు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను అమలుపరుస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని ఫిబ్రవరి 12 నేడు జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులందరూ పాల్గొని మన సమ్మె విజయవంతం చేయాలని జనగామ జిల్లా సిఐటియు సమక్షంలో పిలుపు ఇచ్చామన్నారు…
