minister | ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ప్రభుత్వపరంగా కృషి చేస్తాం..

minister | ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ప్రభుత్వపరంగా కృషి చేస్తాం..
minister | మచిలీపట్నం, ఆంధ్రప్రభ; నిరుపేద బ్రాహ్మణులు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం అవ్వాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా వ్యాపారం చేసుకుని బ్రాహ్మణులుఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను వ్యాపారం నిమిత్తం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, డీకే బాలాజీ, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్, బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్, గోర్తి శ్రీనివాస్ లు లబ్ధిదారుడు జొన్నలగడ్డ మిధున శ్రీ కు 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
బ్రాహ్మణులు వ్యాపారం చేసుకుని ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ప్రభుత్వపరంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా లోన్లు ఇప్పించి నిరుపేద బ్రాహ్మణులను ఆర్థికంగా బలోపేతం చేస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అరుంధతి సూక్ష్మ రుణ పథకం, వశిష్ట సూక్ష్మ రుణ పథకం, అర్చకమిత్రా పథకం, పురోహిత మిత్ర పథకం, బ్రాహ్మణ ఎంప్లాయిస్ కు పర్సనల్ లోన్స్, ఆస్తి తనక రుణములు, ప్రాజెక్టు ఫైనాన్స్ రుణాలు, ఉన్నత విద్య కోసం రుణాలు ఇలా అనేక రకాల పథకాలతో బ్రాహ్మణుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వపరంగా ఏర్పడిన బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలు అందిస్తూ నిరుపేద బ్రాహ్మణులను ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతోంది అన్నారు.బ్రాహ్మణుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. బ్రాహ్మణులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, గొర్రెపాటి గోపీచంద్, జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్, బండి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు, లో గిశెట్టి వెంకటస్వామి, 39 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, కట్ట అంజిబాబు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్, చోడవరపు లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
