AP | మేకల భిక్షం ను అభినందిస్తున్న గొట్టిపాటి లక్ష్మి

AP | మేకల భిక్షం ను అభినందిస్తున్న గొట్టిపాటి లక్ష్మి
ఎస్సీ కమిషన్ సభ్యుని గా మేకల భిక్షం
AP | దర్శి, ఆంధ్రప్రభ : దర్శి నియోజకవర్గంలోని దొనకొండ పట్టణానికి చెందిన మేకల బిక్షం (దాసు) ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్.సి. కమిషన్ మెంబర్ గా ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఏర్పాటుచేసిన అభినందన సభ కు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక న్యాయం, దళితుల హక్కుల పరిరక్షణ దిశగా వారి సేవలు మరింత ఫలప్రదంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో యువ నాయకులు కడియాల కడియాల లలిత్ సాగర్, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి-సుబ్బారావు, దొనకొండ,సర్పంచ్ గ్రేస్ మెన్, దర్శి మండలాల టిడిపి అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, మారెళ్ల వెంకటేశ్వర్లు, మండల ప్రధానకార్యదర్శి పురుషోత్తం సత్యానందం తదితరులు పాల్గొన్నారు.
