Development | గ్రామీణ మహిళల అభివృద్ధి, సాధికారతే లక్ష్యం

Development | గ్రామీణ మహిళల అభివృద్ధి, సాధికారతే లక్ష్యం
- సర్పంచ్ చీమల రాజు యాదవ్.
Development | మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామీణ మహిళల అభివృద్ధి, సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నామని సర్పంచ్ చీమల రాజు యాదవ్ అన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామంలో మహిళా సమైక్య సంఘ భవనంకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ చీమల రాజు యాదవ్ మాట్లాడుతూ… మహిళలకు శాశ్వత వేదిక కల్పించడమే ఈ భవన నిర్మాణ ముఖ్య లక్ష్యమని తెలిపారు. మహిళా సంఘాల సమావేశాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు ఉపయోగపడుతుందన్నారు.
గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర మరింత బలోపేతం కావాలని, అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు గ్రామపంచాయతీ కృషి చేస్తోందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ఆ విధానాలను గ్రామస్థాయిలో అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ సతీష్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి బండ లింగస్వామి,పాలకవర్గ సభ్యులు బొజ్జ మారయ్య,జిల్లా స్వామి, బొజ్జ సైదులు, గ్రామ శాఖ బొజ్జ మల్లయ్య, నారగోని నరసింహ, ఆవుల శ్రీను, మద్ది చంద్రారెడ్డి, మేకల శ్రీను, బాతరాజు గోవిందు, బొజ్జ అంజయ్య, నక్కల గణేష్, చెడు బుద్ధి సైదులు తదితరులు పాల్గొన్నారు.
