పోటీ ఏదైనా కాంగ్రెస్ గెలుపు పక్క

పోటీ ఏదైనా కాంగ్రెస్ గెలుపు పక్క

టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు
5వ వార్డులో కాంగ్రెస్ గెలుపు ఏకపక్షం
యువ అభ్యర్థి సహేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

మంథని: రాష్ట్రంలో పోటీ ఏదైనా కాంగ్రెస్ గెలుపు ఖాయమని టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సహేందర్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, ప్రచారంలో దూసుకుపోతోంది. శనివారం దుద్దిళ్ల శ్రీనుబాబు వార్డులో పర్యటించి, ప్రతి గడపకూ వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వార్డు అభివృద్ధికి యువత నాయకత్వం అవసరం ప్రచారంలో శ్రీనుబాబు మాట్లాడుతూ.. విద్యావంతుడు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి సహేందర్ అని, ఆయనను గెలిపిస్తే వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో 5వ వార్డును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. సామాన్యులతో మమేకం ప్రచార పర్వంలో నాయకులు వినూత్నంగా ప్రజలతో మమేకమయ్యారు. స్థానికులతో ముచ్చటించారు. నిరాడంబరంగా సాగిన ఈ ప్రచారానికి వార్డు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించారు. ప్రజా మద్దతుతో ముందడుగు బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అభ్యర్థి సహేందర్ తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డు సేవకుడిగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply