కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి.-అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది

-18వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ జబ్బార్
స్టేషన్‌ఘన్‌పూర్, ఫిబ్రవరి4 ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలోని 18వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ జబ్బార్ బుధవారం వార్డులో కలియతిరుగుతూ సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో తనకు కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి. అభివృద్ధి చేసి చూపిస్తానని వార్డు ప్రజలను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..వార్డులో తాగునీరు, డ్రైనే జీ, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
