AP | చంద్రబాబు ట్విస్ట్ – ఎవరూ ఊహించని నేతలకు ఎమ్మెల్సీ టికెట్స్

వెలగపూడి – ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించింది..

5 స్థానాలకు గాను ఇప్పటికే ఒకటి జనసేనకు ఇవ్వగా, మరొకటి బీజేపీకి కేటాయించనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తే కావలి గ్రీష్మ.సామాజిక వర్గాల వారీగా ముగ్గురు నాయకులకు అవకాశం కల్పించింది. ఎస్సీ మాల సామాజిక వర్గం నాయకురాలు, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గీష్మ కాగా, యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత బీద రవిచంద్రతో పాటు బోయ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు బీటీ నాయుడును తమ అభ్యర్థులుగా టీడీపీ అధిష్టానం వెల్లడించింది.

ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే మరో ఎమ్మెల్సీ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానాన్ని బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

ఎమ్మెల్సీగా బిటి నాయుడు కి మరో ఛాన్స్.

టీడీపీ నాయకులు, బీటి నాయుడుకి మరోసారి ఎమ్మెల్సీగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆదివారం టిడిపి విడుదల చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో బీటీ నాయుడు పేరును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రకటించారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం జుమలదిన్నెకు చెందిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ నెల 29తో పదవీ కాలం ముగియనుండగా తాజాగా సీఎం చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం విశేషం. సోమవారం ఆయన నామినేషన్ వేయనున్నారు. బీటీ నాయుడు 1994 నుంచి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. గతంలో రెండు సార్లు కర్నూలు జిల్లా నుంచి టిడిపి ఎంపీగా పోటీ చేసి ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత టిడిపి అధిష్టానం ఆయనను వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గా నియమించింది. అంతకుముందు ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు చోటు కల్పించారు. కర్నూలు జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులుగా కూడా బీటీ నాయుడు పనిచేశారు. 2024 ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం మెరకు పార్టీ అధ్యక్ష పదవిని తిక్క రెడ్డికి వదులుకున్నారు. వీటన్నిటిని గుర్తించి తిరిగి బిటి నాయుడుకు మరోసారి ఎమ్మెల్సీగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుఅవకాశం కల్పించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *