injuries | కోతుల దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు…

injuries | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఒక వ్యక్తిపై మంగళవారం కోతులు దాడి చేశాయి. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. గ్రామానికి చెందిన లింగంపేట తిరుమల గౌడ్ తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుండి వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్నారు. గ్రామంలో గుంపులుగా ఉన్న కోతులు ఆయనపై దాడి చేశాయి దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి గ్రామంలో గల ఆరోగ్య ఉప కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్సలు చేసిన అనంతరం కామారెడ్డికి వెళ్లాలని స్థానిక వైద్యులు సూచించారు. గ్రామంలో విచ్చలవిడిగా కోతులు, స్వైర్య విహారం చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కోతుల గుంపుల వల్ల ఇండ్లలోనుండి బయటకు రాని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గ్రామంలో ఉన్న కోతుల బెడదను వెంటనే నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
