Choppadandi | సీఎం సభకు..

Choppadandi | సీఎం సభకు..
- చకాచకా ఏర్పాట్లు
- పటిష్టమైన భద్రత
- సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే, సీపీ
Choppadandi | చొప్పదండి, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం కరీంనగర్ జిల్లా చొప్పదండిలో చకాచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈనెల 5న చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇవాళ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం, జిల్లా అధికారులతో కలిసి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం సభాస్థలిని పరిశీలించారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులతో చర్చించారు. సభా స్థలిని పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సిపి వివరించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సత్యం తెలియజేశారు.
