Champions Trophy | టైటిల్ నెగ్గిన జ‌ట్టుపై కాసుల వ‌ర్షం !!

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ అంచనాలకు తగ్గట్టుగా హోరాహోరీగా సాగుతోంది. కాగా, టైటిల్ డిసైడ‌ర్ మ్యాచ్ రేపు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ – న్యూజిలాండ్ జట్ల ఛాంపియ‌న్స్ గా నిలిచేందుకు పోటీ ప‌డ‌నున్నాయి.

ఇదిలా ఉండ‌గా.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ గెలిచిన జ‌ట్టుకు రూ.21.4 కోట్లు అందుకుంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం ప్రైజ్ మనీ రూ.60.6 కోట్లు కాగా.. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి జట్టుకు రూ.1.08 కోట్లు అందుతాయి. అలాగే, గ్రూప్ దశలో గెలిచిన జట్టుకు రూ.29.5 లక్షలు అందుతాయి.

ఫైనల్‌లో గెలిచిన జట్టు ఏకంగా రూ.19.49 కోట్ల ప్రైజ్‌మనీ అందుకబోతోంది. ఫైనల్‌ రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.9.74 కోట్లు ఇస్తారు. ఫైనల్‌లో భారత్ గెలిస్తే ఈ టోర్నీ ఆడినందుకు మొత్తంగా రూ.21.4 కోట్లు అందుకుంటుంది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ :-

  • ఛాంపియన్స్ ట్రోఫీ విన్న‌ర్ : రూ.19.49 కోట్లు
  • ఛాంపియన్స్ ట్రోఫీ రన్నరప్ : రూ. 9.74 కోట్లు
  • సెమీ-ఫైనల్స్‌లో ఎలిమినేట్ అయిన జట్లు : రూ. 4.87 కోట్లు
  • 5వ, 6వ స్థానాల్లో నిలిచిన జట్లు : రూ.3.04 కోట్లు
  • 7వ, 8వ స్థానాల్లో నిలిచిన జట్లు : రూ.1.21 కోట్లు
  • గ్రూప్ దశలో గెలిచిన ప్రతి జట్టుకు : రూ. 29.5 లక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *