Lenin | ఆ రెండు బ్యానర్స్ లో అఖిల్ సినిమాలు…?

Lenin | ఆ రెండు బ్యానర్స్ లో అఖిల్ సినిమాలు…?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అక్కినేని అఖిల్ ఎప్పటి నుంచో బ్లాక్ బస్టర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఈసారి లెనిన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల రిలీజ్ చేసిన లెనిన్ ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ ని షేక్ చేసి దూసుకెళుతుంది. అయితే.. లెనిన్ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడో అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు అఖిల్ ప్లాన్ రెడీ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. అఖిల్ ప్లాన్ ఏంటి..? లెనిన్ తర్వాత సినిమా ఎవరితో..?
Lenin | నాలుగవ సినిమాతో తొలి విజయం..

అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడని.. అక్కినేని అభిమానులే కాదు.. సినీ అభిమానులు అందరూ గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే.. ఫస్ట్ మూవీతో నటుడుగా మెప్పించినా.. కమర్షియల్ సక్సెస్ మాత్రం సాధించలేదు. తొలి విజయం కోసం నాలుగవ సినిమా వరకు వెయిట్ చేయాల్సివచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో అఖిల్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ సక్సెస్ చూశాడు. ఆతర్వాత ఏజెంట్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించాలని తపించాడు.. హామ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ చేశాడు కానీ.. బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు.
Lenin | ఈసారి.. గురి తప్పేదేలే..

దీంతో కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చింది. ఈసారి గురి తప్పేదేలే అన్నట్టుగా లెనిన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో అఖిల్ కు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ ఇద్దరి జంట బాగుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే డివోషనల్ టచ్ తో రూపొందిన ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ ఖచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుందనే ఫీలింగ్ ఫస్ట్ సింగిల్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం క్లైమాక్స్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని మే 1న రిలీజ్ చేయనున్నారు.
Lenin | ఆ రెండు సంస్థల్లో సినిమాలు..

ఇక అసలు విషయానికి వస్తే.. ఇక నుంచి కెరీర్ లో గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడట అఖిల్. లెనిన్ తర్వాత యు.వీ క్రియేషన్స్, హోంబలే ఫిలిమ్స్ సంస్థల్లో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. లెనిన్ మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించి.. ఆతర్వాత నుంచి పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ గా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ రెండు సంస్థల్లో సినిమాలు చేస్తాడని వార్తలు వస్తున్నాయి కానీ.. డైరెక్టర్స్ ఎవరు అనేది మాత్రం బయటకు రాలేదు. లెనిన్ రిలీజ్ తర్వాత పూర్తి వివరాలు అనౌన్స్ చేస్తారని సమాచారం. మరి.. అఖిల్ ఆశించిన బ్లాక్ బస్టర్ సాధించి స్పీడు పెంచుతాడేమో చూడాలి.

