danam nagendar |నేను కారు దిగలే..

నేను కారు దిగలే..
- ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
danam nagendar |వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : పార్టీ ఫిరాయింపుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. నేను ఏ పార్టీ మారలేదని… నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను.. కాంగ్రెస్‌లో చేరలేదని బాంబు పేల్చారు. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన తన ఎదుట విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే దానం నాగేందర్ స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని దానం స్పీకర్‌కు తెలిపారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ పై తాజాగా అఫిడవిట్ సమర్పించిన ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ ను కొట్టివేయాలని స్పీకర్ కు దానం విజ్ఞప్తి చేశారు.

బీఆర్ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు నాకు సమాచారం లేదని నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని దానం స్పష్టం చేశారు. తాను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లాను. అది వ్యక్తిగత హోదాలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ భేటీకి హాజరయ్యానని పేర్కొన్నారు. మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందని అన్నారు.కాగా దానం వాదనపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జరగబోయే పరిణామాలపై బీఆర్ఎస్ ఎలా స్పందించబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది.
