appreciation | ఉత్తమ ఉద్యోగిగా ఎన్నికైన సంగెం ఏఎస్ఐ

appreciation | ఉత్తమ ఉద్యోగిగా ఎన్నికైన సంగెం ఏఎస్ఐ
appreciation | సంగెం, ఆంధ్రప్రభ : 77వ గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్ఐ ఎం. లక్ష్మి ఉత్తమ ఉద్యోగిగా ఎన్నికైన సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారద, డీసీపీ ఈస్ట్ జోన్ అంకిత్ ఐపీఎస్ చేతుల మీదుగా తన సేవ ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగిందని ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై వంశీకృష్ణ మాట్లాడుతూ…. ఏఎస్ఐ లక్ష్మికి ఉత్తమ సేవలకు గుర్తింపు వచ్చినందుకు దానితోపాటు ఎస్సైగా ప్రమోషన్ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఏఎస్ఐ కి ఎస్సై తోపాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది అభినందనలు తెలిపారు.
