- క్లాత్ షోరూంలో చెలరేగిన మంటలు
- 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది
నగరంలోని పాతబస్తీ మదీనాలో ఈరోజు (శుక్రవారం) సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఝన్నీ బజార్ హోల్‌సేల్ క్లాత్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా చెలరేగిన మంటలు ఐదు అంతస్తుల భవనం వరకు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
అయితే, ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలు చెలరేగిన భవనంలోని పై అంతస్తుల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అడ్డుకుంటున్నారు.