MLA | మౌలిక వసతుల కల్పనకు దశలవారీగా కృషి చేస్తా

MLA | మౌలిక వసతుల కల్పనకు దశలవారీగా కృషి చేస్తా
- ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్
MLA | కుంటాల, ఆంధ్రప్రభ : మౌలిక వసతుల కల్పనకు దశలవారీగా కృషి చేస్తానని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఈ సందర్భంగా కుంటాల మండలంలోని దౌనెల్లి తండా నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గల బీటీ రోడ్డు నిర్మాణానికి మంజూరైన రూ. 1. 80 లక్షల నిధులతో 1.8 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి పనులను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం అయినటువంటి కుంటాల నుంచి మహారాష్ట్రలోని శివుని వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. రూ. కోటి 80 లక్షల రూపాయలు పీఆర్ నుంచి ఆర్ ఆర్ ద్వారా నిధులు మంజూరయ్యాయని అదేవిధంగా కుంటాల నుంచి మహారాష్ట్ర ప్రాంతం వరకు బీటీ రోడ్డు నిర్మించేందుకు పీఆర్ నుంచి ఆర్ అండ్ బీకి మార్చడం జరిగిందని గ్రామస్తులకు తెలియజేశారు.
అదే విధంగా గ్రామస్తులు పలు విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తెలుపగా దౌనెల్లి చెరువు నిర్మాణానికి రూ. 35 లక్షల రూపాయలు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభించేందుకు టెండర్లు పూర్తి చేస్తామని అన్నారు. రైతుల కోరిక మేరకు చెక్ డాం నిర్మించి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. శివాలయం అభివృద్ధికి సైతం అభివృద్ధి చేస్తానని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మెట్టు రాజు, ఎంపీడీవో అల్లాడి వనజ పీఆర్ డీఈ రాజేందర్, సర్పంచులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
