Janakamma | ఇంటిలో విషాదం..

Janakamma | ఇంటిలో విషాదం..
- ఆమె ఏకైక కుమారుడు మృతి
Janakamma | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : సినీ పరిశ్రమలో లెజెండ్రీ గాయని ఎస్. జానకి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) ఆ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ రోజు కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మురళీకృష్ణ కేవలం జానకి కుమారుడిగానే కాకుండా, కళారంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. తెలుగు, మలయాళ చిత్రాల్లో నటుడిగానూ రాణించారు. తెలుగులో ‘వినాయకుడు’, ‘మల్లెపువ్వు’ వంటి సినిమాల్లో నటించిన ఆయన, మలయాళ చిత్రం ‘కూలింగ్ గ్లాస్’ కు రచయితగానూ పనిచేశారు.
