T20 | మెరుపు ఆరంభాల‌పై అభిషేక్ శ‌ర్మ‌

T20 | వెబ్‌డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : టీ20 టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌తీ మ్యాచ్‌లో ఓపెన‌ర్‌గా దిగి విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్ర‌తీ మ్యాచ్‌లో త‌న మార్క్‌ను బ్యాటింగ్‌తో అల‌రిస్తున్నాడు. అయితే అభిషేక్ శ‌ర్మ ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై త‌న‌కున్న అభిమాన్ని తెలియ‌జేశాడు. త‌న‌లాగే మ్యాచ్‌లో దూకుడుగా మంచి ఆరంభం ఇవ్వాల‌ని కోరుకుంటాన‌ని తెలిపాడు.

T20

” రోహిత్ భాయ్ దేశం కోసం చాలా చేశాడు. అతను ఇచ్చిన ఆరంభాల తరహాలోనే నేను ఆడాలనుకుంటున్నాను. నేను గ్రౌండ్ లోకి అడుగుపెట్టినప్పుడు మా కెప్టెన్, కోచ్ నా నుండి మెరుపు ఆరంభం కోరుకుంటున్నారు. నేను కూడా రోహిత్ దారిలో వెళ్తున్నాను”. అని స్టార్ స్పోర్ట్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను కొనియాడాడు.

Leave a Reply