Eight sixes | టీ20ల్లో అభిషేక్ తుఫాన్

- సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న టీమిండియా ఓపెనర్
Eight sixes | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : భారత టీ20 స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ రికార్డులను షేక్ చేస్తున్నాడు. పొట్టి ఫార్మట్‌లో రెచ్చిపోతూ పాత రికార్డులను తిరగ రాస్తున్నాడు. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో అభిషేక్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడి సంచలనం సృష్టించాడు. 35 బంతుల్లోనే 84 పరుగులు చేసి రఫ్పాడించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఎనిమిది సిక్స్‌లు బాదాడు. కివీస్‌పై ఒక టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆసియా బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. దీంతోపాటు అభిషేక్ ఓ ప్రపంచ రికార్డును సైతం అందుకున్నాడు.

ఈ క్రమంలో అభిషేక్ తన ఖాతాలో వరల్డ్ రికార్డ్ వేసుకున్నాడు. తాజా ఇన్నింగ్స్‌తో అతడు టీ20ల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని అభిషేక్ కేవలం 2,898 బంతుల్లోనే అందుకున్నాడు. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 5 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.

