100 numbers | హస్తం పార్టీకి మరో షాక్

100 numbers | హస్తం పార్టీకి మరో షాక్

  • బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ యువ నేత బాలు
  • వంద మందితో కలిసి గులాబీ పార్టీలో చేరిక

100 numbers | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి పట్టణం 9వ వార్డు యువ నాయకుడు లాడే బాలు తన అనుచరులు సుమారు వంద మందితో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పొన్న రాజేందర్ రెడ్డి పార్టీని వీడిన విషయం తెలిసిందే.

100 numbers

తాజా చేరికతో సంగారెడ్డి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో లాడే బాలు బీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లాడే బాలు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో తమకు తగిన గుర్తింపు, గౌరవం లభించలేదని, అందుకే పార్టీని వీడినట్లు తెలిపారు.

100 numbers

బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్య నాయకత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా నాయకులు బీఆర్ఎస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికతో సంగారెడ్డిలో బీఆర్ఎస్ మరింత బలపడిందని, సంగారెడ్డి పురపాలక గడ్డపై గులాబీ జెండానే ఎగరాలి అనే నినాదం మరోసారి ప్రతిధ్వనించిందని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply