Axe attack | మద్యం మత్తులో ఘ‌ర్ష‌ణ‌..

Axe attack | మద్యం మత్తులో ఘ‌ర్ష‌ణ‌..

  • గొడ్డలితో దాడి..
  • పెయింటర్ దారుణ హత్య
  • మేడ్చల్‌లో ఘ‌ట‌న‌

Axe attack | మేడ్చల్, ఆంధ్రప్రభ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో భాగంగా గుండ్ల పోచంపల్లి సర్కిల్ పరిధిలోని గౌడవెల్లిలో ఒక వ్యక్తిని దారుణంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన మేడ్చల్ లో కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌడవెల్లిలోని హనుమాన్ ఆలయ సమీపంలో రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మృతి చెందిన వ్యక్తి పేరు గోమారం లక్ష్మా రెడ్డి (42) వృత్తిరీత్యా పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడని.. మృతుడు లక్ష్మా రెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్న గొర్రెల కాపరి మలిగా లింగం(50) తో కలిసి బుధవారం రాత్రి మద్యం సేవించారని తెలిసింది. మద్యం మత్తులో మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసిందని దీంతో మలిగా లింగం గొడ్డలితో లక్ష్మా రెడ్డి తల పై దాడి చేయగా తలకు తీవ్ర రక్త గాయలై అక్కడికక్కడే మృతి చెందాడని తేలింది. నిందితుడు( మలిగా లింగం)ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply