AP | జిల్లాకు కేంద్ర నిధులు..

AP | జిల్లాకు కేంద్ర నిధులు..
AP | నరసరావుపేట, ఆంధ్రప్రభ : జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ ) సమావేశాన్ని నరసరావుపేటలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు,జిల్లా ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ కృతికా శుక్లా , అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులే ఎజెండాగా జరిగే ఈ సమావేశంలో పలు సూచనలు, సలహాలు చేశారు. జిల్లాకు కేంద్ర నిధులు రాబట్టడంలో అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని, ప్రతి పథకం పై అవగాహన పెంచుకుంటూ, సమన్వయంతో, ప్రతిపాదనలు ఎక్కువగా తయారు చేసుకుని, ప్రతి పనిని కేంద్రం వద్ద ముందుకు తీసుకెళ్లేందుకు సంప్రదించాలని కోరారు. ఈరోజు ప్రధానంగా గిరిజనాభివృద్ధి (ఐటీడీ ), రైల్వేస్, హైవేస్, కేంద్ర ప్రభుత్వ ఉపాధి పథకాలు, హార్టికల్చర్, ఇరిగేషన్, ఉపాధి హామీ పథకాలు, గృహ కల్పన, CSR నిధులు, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలపై చర్చలు జరిగాయి.
ఫిబ్రవరి నెలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పల్నాడు జిల్లా పర్యటన ఉన్నందున, ఇప్పటికే దాదాపు రూ. 1500 కోట్ల రుణాలు ప్రజలకు ఇస్తున్నందున.. ఈ నిధులు అధికారులు ప్రజలకు అందించుటలో వేగం పెంచాలి. ట్రాన్స్ జెండర్లకు ట్రైనింగ్ ఇచ్చి లోన్స్ ఎక్కువగా ఇస్తున్నారని, అలాగే గిరిజనులకు కూడా రుణ సదుపాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించాను. సూర్యఘర్ పథకంలో పురోగతిని మరింతగా సాధించాలని సూచించాను. ఇరిగేషన్ విషయంలో.. వరికిపూడిసెల ప్రాజెక్ట్ ని త్వరగా పట్టాలెక్కించేందుకు, నీటి వనరులను బాగు చేసే RRR స్కీమ్ అమలుకు, లిఫ్ట్ ఇరిగేషన్ ల అభివృద్ధి దిశగా చర్చించాము. జాతీయ రహదారుల విషయానికొస్తే.. ప్రస్తుతం జరుగుతున్న హైవే పనులు త్వరగా పూర్తి చేసేందుకు, కొత్త ప్రతిపాదనలు, భూసేకరణలు, ఇతర అడ్డంకులు క్లియర్ చేసే అంశాలపై చర్చిస్తూ.. వినుకొండ – గుంటూరు జాతీయ రహదారిని త్వరగా పట్టాలెక్కించాలని, రహదారులపై గ్రీనరీ పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించాము. హార్టికల్చర్ విభాగానికొస్తే.. ఉద్యానవన హబ్ గా పల్నాడు అభివృద్ధి చెందాలని, నకరికల్లు వద్ద ఇండో ఇజ్రాయిల్ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి రైతులుకు అందించాలని, కేంద్ర ప్రభుత్వ పథకం పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎక్కువ అప్లికేషన్ పెట్టించి లోన్స్ వచ్చేలా చొరవ చూపాలని సూచించాను. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సిఎస్ఆర్ నిధులు ఎక్కువ సాధించే ప్రణాళికతో పని చేద్దామని చర్చించాము.
రైల్వేస్ లో.. ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు భూసేకరణలు, నిధుల ప్రతిపాదనలు వంటి వాటిపై రైల్వే అధికారుల చొరవ ఎక్కువగా ఉండాలని సూచించాను. గిరిజనాభివృద్ధి (ఐటీడీ ) చర్చలో భాగంగా.. వారికి గృహకల్పన, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు వంటి వాటికి పీఎం జన్మన్, పీఎంఈజీపి, పీఎం కెఈవై వంటి పథకాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని, నిధుల ప్రతిపాదనలు ఎక్కువగా పొందుపరచాలని సూచించాను. ద్వామా డిపార్ట్మెంట్కు సంబంధించి.. ఉపాధి హామీ పథకం సవరణ జరిగి వచ్చిన జి రామ్ జి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామ సభలు ఎక్కువగా నిర్వహించి జాబ్ కార్డులు వచ్చేలా చూడాలని, సిసి రోడ్లు డ్రైన్స్, వాటర్ షేడ్స్, గోకుల్ షెడ్స్ అభివృద్ధికి ప్రతిపాదనలు ఎక్కువగా పంపాలని సూచించడం జరిగింది. యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా పీఎం కుశల్ వికాస్ యోజన పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించాను. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు పాల్గొన్నారు.
