Sports | క్రీడలు సామరస్యంగా నిర్వహించాలి

Sports | క్రీడలు సామరస్యంగా నిర్వహించాలి
- డీసీసీ సుగుణక్క
- జంగాంలో క్రికెట్ పోటీలు ప్రారంభం
Sports | జైనూర్, ఆంధ్రప్రభ : క్రీడలు సామరస్యంగా, స్నేహపూర్వకంగా నిర్వహించాలని, పోటీల్లో గెలుపు, ఓటములు సహజమని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణక్క అన్నారు. ఇవాళ కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జంగాం గ్రామంలో జనసేన అసోసియేషన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను అసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ తో కలిసి ప్రారంభించారు.

ఈసందర్భంగా తొలి బంతికి బ్యాట్‌తో ఆడి టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ… క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు. గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమని, ఇలాంటి టోర్నమెంట్లు యువతకు సరైన దిశను చూపుతాయని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ రావు, ఆత్మ చైర్మన్ రాథోడ్ రమేష్, సర్పంచ్ అనసూయ బాయి-అర్జున్, ఉపసర్పంచ్ సయ్యద్ సజద్, జైనూర్ సీఐ రమేష్, మండల అధ్యక్షుడు ముఖిద్, మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్ యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ రమేష్, మాజీ ఎంపీటీసీ ఎండి అత్తర్, గెడెం గోపీచంద్, అజ్జులాల, సయ్యద్ అబ్దుల్లా, పేందూరు సంజు, సఫిక్ హైదర్, రహీం, జనసేన అసోసియేషన్ యూత్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, క్రీడాకారులు, యువత పాల్గొన్నారు.
