Nalgonda | ఘనంగా ఎన్టీఆర్ 30 వ వర్ధంతి

Nalgonda | ఘనంగా ఎన్టీఆర్ 30 వ వర్ధంతి
Nalgonda | నల్గొండ, ఆంధ్రప్రభ : నల్లగొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నల్గొండ పార్లమెంటు కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులూ తుమ్మల మధుసూదన్ రెడ్డి, ఎల్.వి.యాదవ్ గార్ల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు 1983 లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఏదైనా ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అధికారంలోకి రావడంతో పాటు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి వారి రాజకీయ అభివృద్ధి కోసం, సమ సమాజ ఏర్పాటు కోసం కృషి చేయడం జరిగిందన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనేకమంది బడుగు బలహీన వర్గాలని మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఎంతో మందిని తీర్చిదిద్దిన ఘనత నందమూరి తారక రామారావుకి దక్కిందన్నారు. సామాన్య ప్రజలు అభివృద్ధి కోసం వృధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, పక్క గృహ నిర్మాణాలు వంటి అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ గారిదని కొనియాడారు. ఆయన బాటలో నేటి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కూడా వారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్తూ యూవత అభివృద్ధి కోసం నిరుద్యోగ నిర్మూలన కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. తాను మరణించిన తర్వాత కూడా ఆయన ప్రారంభించిన పథకాలను ఇప్పటివరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు పేర్లు మారుస్తూ అవ్వే పథకాలను కొనసాగిస్తా ఉన్నాయని.. ఇక ముందు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ప్రత్యక్ష ఎన్నికలలలో పాల్గొని పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒకే తాటిమీద ఉండి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్, ఆకునూరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, తేలు అన్న రవి యాదవ్, బక్కతోళ్ళ ఇస్తారి, ఎంకెఐ సిద్ధిక్, పాలడుగు నాగరాజు, గద్దపాటి వెంకటేశ్వర్లు, గంగాధర్ స్వరాజ్, గోవిందు బాలరాజు, ఆరేళ్ళ కొండల్, కంచనపల్లి క్రాంతి, దేప మోహన్ రెడ్డి, కూరపాటి కిషోర్, దాడి మధుసూదన్ రెడ్డి, అండెం తిరుపతయ్య గౌడ్, మారినేని విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
