Cemetery | స‌దుపాయాలు క‌ల్పించండి..

Cemetery | స‌దుపాయాలు క‌ల్పించండి..

  • శ్మ‌శాన వాటికలను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ

Cemetery | నరసరావుపేట, ఆంధ్రప్రభ : పట్టణంలోని వివిధ శ్మ‌శాన వాటికలను అభివృద్ధి చేయాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆయన రావిపాడు రోడ్డులోని స్వర్గపురి–2 శ్మ‌శాన వాటిక, రావిపాటి రోడ్డులో ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల పక్కన ఉన్న శ్మ‌శాన వాటికతో పాటు చిలకలూరిపేట రోడ్డులోని ముస్లిం మైనార్టీల కబరస్తాన్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా శ్మ‌శాన వాటికల్లో మౌలిక వసతులు, పారిశుధ్య పరిస్థితులు, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలపై సంబంధిత మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. ప్రజలకు అంత్యక్రియల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

స్మశాన వాటికల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని, త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పాలపాడు రోడ్డు లోని వాటర్ ట్యాంక్ వద్ద తాగునీటి పైపు లైన్ లీకు అవుతుందని పత్రికల్లో క‌థ‌నాలు రావడంతో వెంటనే స్పందించి.. ఆ ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే పైపు లైన్ మరమ్మత్తులు చేయాలని సంబంధిత మునిసిపల్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాసిరెడ్డి రవి, మాబు, అత్తలూరి సీతయ్య, నల్లపాటి చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply